పిటి పార్కర్Pity Parker

నరులకు మణి || A Poem on International Women's day

**నా కన్నీటి కథనాలు అచ్చుకేనా
అవి ఎరుగునా న్యాయం మచ్చుకైనా

నా కళలు ఇంకేది వంటగది గచ్చుకేనా
అవి ఎరుగునా కరతాళధ్వనులు ఈ తరమైనా

నా బ్రతుకు అంటుల మోతేనా
అది ఎరుగునా బుగ్గ కారుల కూత ఏనాటికైనా

నా చాతుర్యము కూరగాయల బేరాలకేనా
అది ఎరగదా చట్టసభల కర్మవాచకాన్ని

నా చదువులు పత్రికలు చడవడానికేనా
అవి ఎరుగునా కలం సిరాని ఇప్పటికైనా**
**
నారీమణి, ధరించు కలానికి నీ గళం ఇప్పటికైనా
సంధించు విప్లవ తూటా స్వతంత్రం పొందేదాకా

పోరాడితే పోయేదేమిలేదు వనితా
నీ బానిస సంకెళ్లు తప్ప!!!**