పిటి పార్కర్Pity Parker

సిద్ధార్థలో తెలుగు భాషా దినోత్సవం: ఒక మంచి జ్ఞాపకం

నా బద్ధకానికి ఏమైనా ఆస్కార్ అవార్డు ఇస్తే, వెళ్లి ఆ అవార్డు తీసుకోవడానికి కూడా నేను బద్ధకిస్తానేమో! ఏదైనా మంచి ముచ్చట జరిగితే వెంటనే రెండు ఫొటోలు పెట్టి పది మందికి చెప్పుకోవాలనే అలవాటును చాలా కష్టపడి పెంచుకుంటున్నా (కానీ వర్కవుట్ అవ్వట్లేదు). సరిగ్గా నెల క్రితం జరిగిన ప్రోగ్రామ్ ఫొటోలు ఇప్పుడు ఎందుకు పెడుతున్నానంటే... నా ఫోన్లో మెమొరీ ఫుల్ అయిపోయింది. ఫేస్బుక్ అయితే మనకు ఫ్రీ క్లౌడ్ స్టోరేజ్ కదా, గ్యాలరీ ఖాళీ అవుతుందని ఇక్కడ దాచుకుంటున్నా!

విషయం ఏంటంటే.. గత నెల (సెప్టెంబర్ 28న) పీబీ సిద్ధార్థ, ముమ్మినేని సుబ్బారావు కళాపీఠం వాళ్లు తెలుగు భాషా దినోత్సవానికి ఆహ్వానించారు. మన 'పిచ్చాసుపత్రి' పుస్తకం బయటకు వచ్చాక, నా రాతల్ని కూడా కవిత్వం అని గుర్తించి ఇలా పిలవడం నిజంగా ఒక మంచి గుర్తింపులా అనిపించింది.

వేదిక మీద Sree Vasista Somepalli అన్న, తులసి పద్మశ్రీ గారితో కలిసి స్టేజ్ షేర్ చేసుకోవడం ఒక ఎత్తు అయితే.. మైక్ దొరికింది కదా అని 'నేనెందుకు కవిత్వం రాస్తాను' అనే టాపిక్ మీద ఏకంగా ముప్పావుగంట (45 నిమిషాలకు పైనే) నాన్ స్టాప్‌గా లాగించేశాను. నాలోంచి అన్ని మాటలు ఎలా వచ్చాయో నాకే తెలీదు, ఫ్లోలో టైమ్ అస్సలు చూసుకోలేదు. నిర్వాహకులు ఎవరూ నన్ను ఆపలేదు (కనీసం కింద నుంచి చీటీలు కూడా పంపలేదు), కానీ స్టేజ్ దిగాక నాకే కొంచెం గిల్టీగా అనిపించింది. పాపం మిగతా స్పీకర్ల టైమ్ కూడా నేనే తినేశానేమో అనిపించింది .

ప్రేమతో పిలిచిన Sa Sree గారికి, ప్రోగ్రామ్‌లో నన్ను, నా ముప్పావుగంట స్పీచ్‌ను ఓపికగా భరించిన డీన్ ఆచార్య Rajesh Jampala గారికి, కళాపీఠం కార్యదర్శి బి.వి.ఎస్. ప్రకాష్ గారికి, ఉపాధ్యక్షుడు టి. రమేష్ గారికి నా కృతజ్ఞతలు. అలాగే... నేను ఎక్కడికెళ్లినా నాతో వచ్చే మా పిల్లలకు బోలెడంత ప్రేమ

ఏదేమైనా ఇదొక మంచి జ్ఞాపకం. ఇలాంటి మంచి మూమెంట్స్ జరిగినప్పుడు ఎప్పటికప్పుడు పోస్ట్ చేసేలా నా బద్ధకం వదిలిపోవాలని దేవుడ్ని కోరుకుంటున్నా!

యువ కవులతో ముఖాముఖి వేదిక మీద పిటి పార్కర్
సిద్ధార్థ కళాశాలలో ప్రసంగిస్తున్న పిటి పార్కర్
యువ కవులతో ముఖాముఖి కార్యక్రమంలో పిటి పార్కర్

పత్రికల్లో

సాక్షి: సిద్ధార్థలో ఘనంగా యువ కవితాగానం
సాక్షి, విజయవాడ తూర్పు, 30 ఆగస్టు 2026
ఆంధ్రప్రభ: కవిత్వం అసంపూర్ణ వాక్య పరంపర
ఆంధ్రప్రభ, విజయవాడ, 30 ఆగస్టు 2026
ఈనాడు: తెలుగు భాషాభ్యున్నతికి తోడ్పడాలి
ఈనాడు, అమరావతి ఎన్టీఆర్, 30 ఆగస్టు 2026

ఈ రెండు నెలల్లో బోలెడన్ని మంచి విషయాలు జరిగాయి. అన్ని త్వరలో పంచుకుంటా…